కొత్త రికార్డు... నిన్న తిరుమలలో లక్ష మందికి స్వామి దర్శనం!
- పెరటాసి మాసం ప్రారంభం
- తొలిరోజే కిక్కిరిసిన ఏడు కొండలు
- సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం
ఇక ఆదివారం నాడు స్వామివారిని 1,03,310 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇది ఓ రికార్డు. ఈ ఉదయం దర్శనం కోసం వచ్చిన వారికి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాధారణ భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను అధికారులు నిలిపివేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అన్న పానీయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.