ప్రజలకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ ను తరిమికొట్టాలి: కాంగ్రెస్ నేత సీతక్క
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- కార్మికుల ఉద్యమం కేసీఆర్ కు కనబడటం లేదా?
- కార్మికులకు అండగా ఉంటాం
కేసీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలతో నిప్పు రాజుకుంది: మంద కృష్ణ మాదిగ
ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న కేసీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలతో నిప్పు రాజుకుందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
కాగా, తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం ద్వారా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతోంది.