పంజాబ్, పఠాన్‌కోట్‌ల మీదుగా పాక్ డ్రోన్లు.. హై అలర్ట్
- సరిహద్దులో సంచరిస్తున్న పాక్ డ్రోన్లు
- భారత భూభాగంలో ఆయుధాలు, మందుగుండు జారవిడుస్తున్న వైనం
- సరిహద్దులో అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు
హిమాచల్‌ప్రదేశ్ అటవీ ప్రాంతంలో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అణువణువు గాలిస్తున్నారు. ఇళ్లు, నివాస ప్రాంతాలతోపాటు ఆ ప్రాంతం గుండా ప్రయాణించే వ్యక్తుల గుర్తింపు కార్డులను కూడా తనిఖీ చేస్తున్నారు. పంజాబ్-హిమాచల్‌ప్రదేశ్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతాయని ఈ ఆపరేషన్‌తో సంబంధం ఉన్న పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.