Chandrababu: అబద్ధాలకూ ఓ హద్దుండాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో చంద్రబాబునాయుడు పాలనలో లక్షలాది మంది ప్రజలకు కంటి పరీక్షలు చేశామని చెప్పుకుంటున్నారని, అబద్ధాలు ఆడేందుకు కూడా ఓ హద్దు ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు పాలనలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అంధత్వాన్ని పారద్రోలామని, మళ్లీ పరీక్షలెందుకంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని విజయసాయి విమర్శించారు. రికార్డుల్లో దొంగ రాతలు రాసుకుని రెండు నుంచి మూడు వందల కోట్లు దిగమింగినట్టు ఆయనే బయట పెట్టుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.

గ్రామ వలంటీర్ల నియామకంపై చంద్రబాబు తన కడుపు మంటను మళ్లీ బయట పెట్టుకున్నాడని మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి విమర్శించారు. నెలకు రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి వలంటీర్లను నియమించేందుకు అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు గుడ్లు ఉరుముతున్నారని, తన కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చి ఐదు లక్షల కోట్లు దోచుకున్నోడు ఇంతకంటే ఏం మాట్లాడతాడని బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
vijayasai reddy

More Telugu News