Chandrababu: చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించిందేమో!: మంత్రి బొత్స

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చూసి సచివాలయ వ్యవస్థను తానే తీసుకొచ్చానని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు.

ఆ సచివాలయం వేరు, సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు అన్నది బాబు తెలుసుకోవాలని సెటైర్లు విసిరారు. గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చాడా? అని ప్రశ్నించారు. ఏపీలో నిన్న ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకం టీడీపీ హయాంలో ఉన్నదే అని బాబు వ్యాఖ్యానించడంపైనా ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజా రంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
minister
Botsa Satyanarayana

More Telugu News