విమానంలో చంద్రబాబును చూసి... పక్కన కూర్చుని ముచ్చట్లాడిన కపిల్ దేవ్.. వీడియో ఇదిగో!
- గుంటూరుకు వచ్చిన కపిల్ దేవ్
- టెన్త్ టాపర్లకు అవార్డులు
- తిరుగు ప్రయాణంలో తారసపడ్డ చంద్రబాబు
అదే విమానంలో చంద్రబాబు కూడా ప్రయాణిస్తున్నారు. చంద్రబాబును చూసిన కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని, కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలను గురించి ఈ సందర్భంగా చంద్రబాబు, కపిల్ కు వెల్లడించారు. కాగా, రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కపిల్ హాజరై, పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులను అందించారు.