manyamkonda: మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే పలు రైళ్లు పాక్షిక రద్దు!

షార్ట్స్‌లో చూడండి
మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ రైల్వే ట్రాక్ పైకి కాంక్రీట్ క్లీనింగ్ భారీ యంత్రం ఒరిగింది. దీంతో, ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లకు ఆటంకం ఏర్పడింది.

దీంతో కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్, సికింద్రాబాద్-కర్నూలు సిటీ ఎక్స్ ప్రెస్ ను మహబూబ్ నగర్ వరకే పరిమితం చేశారు. కాచిగూడ-కర్నూలు సిటీ రైలును ఉందానగర్ వరకు, తుంగభద్ర ఎక్స్ ప్రెస్ (కర్నూలు సిటీ- సికింద్రాబాద్)  రైలును దేవరకొండ వరకు, రాయచూర్- కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును గద్వాల వరకు, గుంటూరు-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కౌకుంట్ల వరకు పరిమితం చేశారు.

ఇక కాచిగూడ-చెంగల్ పట్టు, కాచిగూడ-నాగర్ కోయిల్, కాచిగూడ-చిత్తూరు, కాచిగూడ-మైసూరు రైళ్లను, ఓఖా-రామేశ్వరం ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ ని రాయచూర్, గుత్తి మీదుగా మళ్లించారు. రైల్వే ట్రాక్ పై ఒరిగిపడ్డ క్లీనింగ్ యంత్రాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక రైలును అక్కడికి పంపనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. 
Go Back to Shorts
manyamkonda
secunderabad
kachiguda
kurnul

More Telugu News