సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నయనతార పెళ్లి కబురు!
- నితిన్ కోసం స్టార్ టెక్నీషియన్లు
- శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రకటన
* వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో నితిన్ నటించే చిత్రం షూటింగ్ నిన్న విజయదశమి రోజున లాంఛనంగా మొదలైంది. కాగా, ఈ చిత్రానికి స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రముఖ కెమేరామేన్ పీసీ శ్రీరాం, బిజీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తుండడం విశేషం.
* ఇటీవల 'బ్రోచే వారెవరురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో శ్రీవిష్ణు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. వచ్చే నెల నుంచి షూటింగ్ జరుగుతుంది.