మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై హైదరాబాదులో కేసు నమోదు!
- ఆళ్లగడ్డలో భార్గవ్ రామ్ పై రెండు కేసులు
- తప్పించుకుని తిరుగుతున్న భార్గవ్ రామ్!
- గచ్చిబౌలీ పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఆళ్లగడ్డ ఎస్సై
అయితే భార్గవ్ రామ్ తన కారును ఆపినట్టే ఆపి దూకుడుగా ముందుకు ఉరికించడంతో ఎస్సై రమేశ్ బృందం ప్రమాదం నుంచి తప్పించుకుంది. అనంతరం భార్గవ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో తనపైనే దాడికి యత్నించాడంటూ ఆ ఎస్సై గచ్చిబౌలి పోలీసులకు భార్గవ్ రామ్ పై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడని, కారుతో తమపైకి దూసుకువచ్చేందుకు యత్నించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఎస్సై రమేశ్ ఫిర్యాదుతో అఖిలప్రియ భర్తపై సెక్షన్ 353, 336 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.