మాది పెద్ద సంస్థ కాబట్టి వీడి విన్యాసాలు, వికృతాలు తట్టుకోగలిగాం: బండ్ల గణేశ్ పై పీవీపీ వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాది పెద్ద సంస్థ కాబట్టి వీడి విన్యాసాలు, వికృతాలు తట్టుకోగలిగాం: బండ్ల గణేశ్ పై పీవీపీ వ్యాఖ్యలు

  • ఇండస్ట్రీలో కాక రేపుతున్న 'బండ్ల గణేశ్ వర్సెస్ పీవీపీ'
  • ఒకరిపై ఒకరు ఆరోపణలు
  • బండ్ల గణేశ్ తో తాడోపేడో తేల్చుకుంటామన్న పీవీపీ
టాలీవుడ్ నిర్మాతలు బండ్ల గణేశ్, 'పీవీపీ' (పొట్లూరి వరప్రసాద్) మధ్య ఆర్థిక విభేదాలు రచ్చకెక్కాయి. పీవీపీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ తెరపైకి వచ్చిన బండ్ల గణేశ్ ఆపై తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ధ్వజమెత్తాడు. దీనిపై పీవీపీ స్పందించారు. 2013లో టెంపర్ చిత్రం కోసం ఆర్థికసాయం కావాలని అడిగితే డబ్బు అందించామని, 2015లో సినిమా రిలీజైనా తమకు చెల్లించాల్సిన బాకీ మాత్రం చెల్లించలేదని వెల్లడించారు. బండ్ల గణేశ్ గత ఆరేళ్లుగా ఆ బాకీ ఎగవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, తన సిబ్బందిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడని, మోసం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

హోటల్ లో మాట్లాడుకుందాం అని వెళితే నోటికొచ్చినట్టు మాట్లాడాడని, అప్పటికీ ఎంతో ఓర్పు వహించామని పీవీపీ వెల్లడించారు. తన ఇంటికి కొందరిని పంపించి హోం మంత్రి తెలుసంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వివరించారు. దశాబ్దకాలంగా తాము 100 చిత్రాల వరకు ఫైనాన్స్ చేసి ఉంటామని, ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదని తెలిపారు. తమది పెద్ద సంస్థ కాబట్టి వీడి విన్యాసాలు, వికృత చేష్టలు తట్టుకోగలిగామని, ఇండస్ట్రీలో ఎవరో ఒకరు బండ్ల గణేశ్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే తాము అమీతుమీకి సిద్ధమయ్యామని పీవీపీ స్పష్టం చేశారు.
PVP
Bandla Ganesh
Tollywood

More Telugu News