కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అశ్వత్థామరెడ్డి
- కేసీఆర్ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది
- రూ.60 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు
- సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుంది
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడిందని, సంస్థకు చెందిన రూ.60 వేల కోట్ల స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. నేటి ఉదయం 8:30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఇందిరాపార్కు వద్ద 16 మందితో నిరాహారదీక్షకు దిగుతామని ప్రకటించారు.