సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
- కార్మికులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
- ఊసరవెల్లిలా రంగులు మార్చారంటూ కేసీఆర్ పై విమర్శలు
టీఆర్ఎస్ పార్టీ చీఫ్ హోదాలో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని మీరు కూడా అభినందించారని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చారని కేసీఆర్ కు గుర్తు చేశారు. "ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేసిన వారిలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు పాలన చేపట్టాక ఆర్టీసీని పట్టించుకోవడం మానేశారు. సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు" అంటూ విమర్శించారు.