మచిలీపట్నంలో దారుణం... పుట్టిన బిడ్డను తల్లి వదిలేసి వెళితే... చెత్తకుప్పలో పడేసిన డాక్టర్, నర్స్!
- పుట్టిన మరుసటి రోజే వదిలేసి వెళ్లిన తల్లి
- చెత్తకుప్పలో వేసిన ఆసుపత్రి సిబ్బంది
- అరెస్ట్ చేసిన పోలీసులు
నర్సింగ్ హోమ్ డాక్టర్ ధన్వంతరి శ్రీనివాసాచార్య, ఏఎన్ఎం బేబీ రాణిలు కలిసి, ఆ బిడ్డను దగ్గర్లోనే ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో పడేశారు. బిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి, ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తరలించినా, పాప ప్రాణాలు దక్కలేదు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్, నర్స్ లను అదుపులోకి తీసుకున్నారు.