విజయవాడ ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకు ఇప్పుడు అర్థమవుతోంది: బండ్ల గణేశ్
- నిర్మాత పీవీపీపై బండ్ల గణేశ్ సెటైర్లు
- సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే
- కమలహాసన్ నే కోర్టుకు లాగిన ‘నీచ చరిత్ర నీది’
సినీ ఇండస్ట్రీకి హిట్ లు, బ్లాక్ బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ, కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా అంటూ ధ్వజమెత్తారు. ప్రపంచంలో నేను ఏ దేశానికైనా హ్యాపీగా వెళ్లి తిరిగొస్తానని, కొందరు స్కామ్ రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్టు చేసి బొక్కలో వేస్తారని అందరూ చెప్పుకుంటుంటే విన్నానంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచం, భారతదేశం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమలహాసన్ నే కోర్టుకు లాగిన ‘నీచ చరిత్ర నీది’ అంటూ పీవీపీపై పరోక్ష విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఎంతో కష్టపడి అధికారాన్ని సీఎం జగన్ జేజిక్కించుకున్నారని, కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, జగన్ తన కీర్తిని పాడు చేసుకోవద్దని ఆయనకు తన వినయపూర్వక విన్నపం అని పేర్కొన్నారు.