తిరుపతి జూలో రాయల్ బెంగాల్ టైగర్ కు ఐదు పిల్లలు... ఒకదానికి జగన్ పేరు పెట్టిన మంత్రి బాలినేని!
- సమీర్, రాణిలకు ఐదు పిల్లలు
- చిన్న మగకూనకు జగన్ పేరు
- పులి పిల్లలను చూసేందుకు సందర్శకుల ఉత్సాహం
కాగా, మగ కూనల్లో చిన్నదానికి తమ అధినేత పేరును పెట్టడం ద్వారా, ఆయనపై తనకున్న అభిమానాన్ని బాలినేని చాటుకున్నట్లయింది. ఇక, పెద్ద కూనకు పెట్టిన పేరుపైనా చర్చ జరుగుతోంది. బాలినేనిని ప్రకాశం జిల్లాలో అభిమానులంతా 'వాసు' అని పిలుస్తుంటారు. ఇప్పుడీ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ఐదు కూనలనూ చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.