Killi Kruparani: కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ వైసీపీ మహిళా నేత కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కృపారాణి తనయుడు క్రాంతికుమార్ వివాహం అలేఖ్యతో విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సీఎంతో పాటు మంత్రులు ధర్మాన కృష్ణదాసు, వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
Killi Kruparani
Jagan
Vizag

More Telugu News