Vinod: 'జబర్దస్త్'కి దూరం కావడానికి అసలు కారణమదే: కమెడియన్ వినోద్

షార్ట్స్‌లో చూడండి
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఈ వేదికపై లేడీ గెటప్పుల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో వినోద్ (వినోదిని) ఒకరుగా కనిపిస్తాడు. ఇటీవల కాలంలో ఆయన 'జబర్దస్త్' స్టేజ్ పై కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ తరఫున ప్రచారం చేసిన కారణంగానే ఆయనను పక్కన పెట్టేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ విషయంపై తాజాగా వినోద్ స్పందించాడు. జగన్ తరఫున ప్రచారం చేసినందుకు కాదు, ఆ సమయంలో ఆ కార్యక్రమం షూటింగుకి తగిన డేట్స్ నేను ఇవ్వలేకపోయాను. ఇందులో నిర్వాహకుల తప్పేమీ లేదు. ఇక నేను ఓ గొడవలో గాయపడటం .. కొంతకాలం పాటు రెస్టు తీసుకోవలసి రావడం వలన నటించడం కుదరలేదు. త్వరలో పూర్తిగా కోలుకుని 'జబర్దస్త్' వేదికపై కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Vinod

More Telugu News