YSRCP: వైసీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించివేసిన మరో వర్గం

సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో పలుచోట్ల వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా చాపాడు మండలం బద్రిపల్లెలో వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చారని... స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆయన ఫ్లెక్సీలను కూడా చించేశారు. దీంతో, అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
YSRCP
Kadapa District

More Telugu News