కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇంటి నుంచి రహస్య డాక్యుమెంట్ల చోరీ.. ఇంట్లో పనిచేస్తున్న యువకుడే నిందితుడు!
- మూడేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న యువకుడే నిందితుడు
- చోరీ చేసిన రహస్య పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులకు ఈమెయిల్
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చోరీ చేసిన రహస్య ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులకు అతడు ఈమెయిల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈమెయిల్ చేసిన అనంతరం తన ఫోన్‌లోని సమాచారాన్ని విష్ణుకుమార్ డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.