Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,050, విజయవాడలో రూ.37,440, విశాఖపట్నంలో రూ.38,880, ప్రొద్దుటూరులో రూ.37,400, చెన్నైలో రూ.37,450గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,210, విజయవాడలో రూ.34,700, విశాఖపట్నంలో రూ.35,690, ప్రొద్దుటూరులో రూ.34,740, చెన్నైలో రూ.35,880గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,800, విజయవాడలో రూ.45,800, విశాఖపట్నంలో రూ.45,700, ప్రొద్దుటూరులో రూ.46,000, చెన్నైలో రూ.48,200 వద్ద ముగిసింది.