BJP: బీజేపీ ఎంపీ జీవీఎల్ కు మాతృవియోగం... సంతాపం తెలిపిన కన్నా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి చౌడేశ్వరి ఇవాళ కన్నుమూశారు. జీవీఎల్ కు మాతృవియోగం కలిగిందన్న విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కన్నా తన సంతాపం తెలియజేశారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో జీవీఎల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
BJP
GVL
Kanna

More Telugu News