Puttaparthi: పుట్టపర్తి ఎమ్మెల్యే నివాసం వద్ద ఆటో డ్రైవర్ హల్ చల్

  • ఆటోకు నిప్పంటించిన డ్రైవర్
  • తన ఆటోకు నెంబరింగ్ ఇవ్వలేదని ఆవేదన
  • ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే నివాసం ఇద్ద ఇవాళ నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ హల్ చల్ చేశాడు. తన ఆటోను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నివాసం ఎదుట నిలిపి దానికి నిప్పు పెట్టాడు. తన ఆటోకి నెంబరింగ్ ఇవ్వలేదని నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు నిరసనగానే తన ఆటోను తగలబెడుతున్నట్టు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
Puttaparthi
MLA
Sridhar Reddy

More Telugu News