Chiranjeevi: నిజానికి ఉయ్యాలవాడ వారసులు చాలా అమాయకులు... ఎవరో వాళ్లను మాపై ఉసిగొల్పారు: చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల ఉయ్యాలవాడ వారసులు ఆందోళనలు చేపట్టడంపై స్పందిస్తూ, వాస్తవానికి వాళ్లు చాలా అమాయకులని, ఎవరో వాళ్లను తమపై ఉసిగొల్పారని చిరంజీవి ఆరోపించారు. వాళ్లది సాధారణ ఆర్థిక స్థితి అని, వాళ్లు సులభంగా ఉచ్చులో పడిపోయారని విచారం వ్యక్తం చేశారు.

వారికి కానీ, వాళ్ల గ్రామానికి కానీ ఏదైనా మేలు చేద్దామని రామ్ చరణ్ భావించాడని, కానీ వాళ్లు "మేం పాతిక కుటుంబాలు ఉన్నాం, కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వాలి" అని డిమాండ్ చేశారని చిరంజీవి వెల్లడించారు. ఆ విధంగా అయితే రూ.50 కోట్లు తాము ఎక్కడినుంచి తెచ్చివ్వగలమని ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల తర్వాత ఎవరి కథ అయినా చరిత్ర కిందికే వస్తుందని, దానిపై వారసులకు హక్కులు ఉండవని, ఈ విషయం కోర్టు కూడా చెప్పిందని తెలిపారు.
Go Back to Shorts
Chiranjeevi
Syeraa
Uyyalawada

More Telugu News