ఆ జాత్యహంకార విద్వేషమే మహాత్మాగాంధీని చంపేసింది: ఇమ్రాన్ ఖాన్
- మోదీ, ఆరెస్సెస్ పై పాక్ ప్రధాని ధ్వజం
- ముస్లింలను తరిమేయాలని ఆరెస్సెస్ భావించిందని ఆరోపణ
- చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందనలేదని వెల్లడి
"కశ్మీర్ లో ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు, నేను బలూచిస్తాన్ లో భారత గూఢచర్యం గురించి చెప్పాను. ఇవన్నీ పక్కనబెట్టి చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందన రాలేదు" అని ఆరోపించారు. పుల్వామా దాడి తర్వాత ఆధారాలు చూపమని అడిగామని, సర్జికల్ స్ట్రయిక్ లో 300 మందిని చంపామని మోదీ చెప్పారని ఇమ్రాన్ వివరించారు. వాస్తవానికి అక్కడ కొన్ని చెట్లు కూలిపోయాయని, తామిప్పుడు వాటిని పెంచుతున్నామని వెల్లడించారు. ఇదంతా ట్రైలర్ అని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని పేర్కొన్నారు.
ముస్లింలను భారత్ నుంచి తరిమేయాలని ఆరెస్సెస్ భావించిందని, ముస్లింలు, క్రిస్టియన్లంటే ఆరెస్సెస్ కి విద్వేషం అని అన్నారు. ఆ జాత్యహంకార పూరిత విద్వేషమే మహాత్మాగాంధీని చంపేసిందని విమర్శించారు.