Vizag: ఇవాళ గిరిజనులు పండగ చేసుకునే రోజు: ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

షార్ట్స్‌లో చూడండి
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేసిందని అన్నారు. గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని, గిరిజనులు పండగ చేసుకునే రోజు అని అన్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనుల సంపదను చంద్రబాబు దోచుకోవాలని చూశారని, బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. 2015లో చంద్రబాబు ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరాడారని, అప్పుడే బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
Go Back to Shorts
Vizag
Manyam
Boxite
Deputy cm
puspa sri vani

More Telugu News