ఆ సినిమాకి శ్రద్ధా కపూర్ 11 కోట్లు అడిగిందట!
- అల్లు అరవింద్ నిర్మాతగా 'రామాయణ'
- శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్
- 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన దీపిక కుదరదని చెప్పిందట. దాంతో దర్శక నిర్మాతలు శ్రద్ధా కపూర్ ను సంప్రదించగా, పారితోషికంగా 11 కోట్లు ఇవ్వమని అడిగిందట. దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా సమాచారం. 3 భాగాలకు కలుపుకుని శ్రద్ధా కపూర్ ఈ పారితోషికం అడిగిందా? లేదంటే ఒక భాగానికే ఇంత డిమాండ్ చేసిందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.