Crime News: విజయవాడలో యువకుడి దారుణ హత్య

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ పట్టణంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని అరండల్‌పేట ప్రాంతం ఉర్దూ స్కూల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మంగింశెట్టి మనోజ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండరాయితో తలపై బలంగా మోదారు. దీంతో మనోజ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో మనోజ్‌ను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Crime News
Vijayawada
man murdered
old issues

More Telugu News