పార్టీ కార్యాలయంలో భార్య చెంప ఛెళ్లుమనిపించిన బీజేపీ నేత.. వీడియో చూడండి
- భార్య సరితా చౌదరిపై చేయి చేసుకున్న అజాద్ సింగ్
- గతంలో దక్షిణ ఢిల్లీ మేయర్ గా పని చేసిన సరితా చౌదరి
- కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తున్న విడాకుల వ్యవహారం
భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోందని... అయితే, బహిరంగ ప్రదేశంలో వీరిద్దరూ ఇలా గొడవ పడతారని తాము ఊహించలేదని ఓ సీనియర్ నేత తెలిపారు. గొడవ నేపథ్యంలో అజాద్ సింగ్ ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి... వికాస్ తన్వార్ కు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు, ఈ ఘటనపై పార్టీ అంతర్గత విచారణకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ఆదేశించారు.