Chiranjeevi: 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నయనతార వస్తోందట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో నయనతార అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. చాలాకాలంగా ఆమె స్థానానికి ఢోకా లేకుండాపోయింది. వచ్చేనెల 2వ తేదీన విడుదల కానున్న 'సైరా' సినిమాలో ఆమె చిరంజీవి సరసన కనిపించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరగనుంది.

మొదటి నుంచి కూడా నయనతార తను చేసిన సినిమా తాలూకు ఫంక్షన్స్ కి రాదు. తాను రానన్న విషయాన్ని అగ్రిమెంట్ చేసే సమయంలోనే ఆమె చెప్పేస్తుందని కూడా అంటారు. అలాంటి నయనతార ఈ సినిమా ఫంక్షన్ కి వస్తుందా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. అయితే, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి ఆమె అంగీకరించిందనేది తాజా సమాచారం. చెన్నైలో తమిళ వెర్షన్ కి సంబంధించి జరుపనున్న ప్రమోషన్ ఈవెంట్ కి కూడా ఆమె వస్తుందని చెబుతున్నారు. నయనతార అభిమానులకు ఇది శుభవార్తే.
Go Back to Shorts
Chiranjeevi
Nayanatara

More Telugu News