Uttar Pradesh: అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని.. దళిత యువకుడి సజీవ దహనం.. కొడుకు మృతితో ప్రాణాలు విడిచిన తల్లి

  • ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఘటన
  • ప్రియురాలిని కలిసి వస్తుండగా అడ్డుకున్న స్థానికులు
  • చితకబాది నిప్పు పెట్టిన వైనం
అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడన్న అక్కసుతో ఓ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. హర్దోయి జిల్లాలోని బదేస గ్రామానికి చెందిన యువకుడు అభిషేక్ అదే గ్రామానికే చెందిన యువతిని ప్రేమించాడు.

 శనివారం రాత్రి ప్రియురాలిని కలిసి వస్తుండగా అడ్డుకున్న కొందరు గ్రామస్థులు అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. గుర్తించిన స్థానికులు కొందరు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh
lovers
Crime News

More Telugu News