ఎయిరిండియా ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య... విదేశాల్లో రాష్ట్రపతి ప్రయాణానికి మూడు గంటల బ్రేక్!
- స్విట్జర్లాండ్ నుంచి స్లోవేనియాకు వెళ్తుండగా ఘటన
- చివరి నిమిషంలో లోపం గుర్తించిన సాంకేతిక నిపుణులు
- హోటల్ కి వెళ్లిపోయిన భారత్ ప్రథమ పౌరుడు
తన ప్రత్యేక విమానంలో ప్రయాణించేందుకు జ్యూరిచ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రయాణం చివరి నిమిషంలో సిబ్బంది విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. రూడర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించి విమానాన్ని వెంటనే నిలిపివేశారు. దీంతో రాష్ట్రపతి విమానం దిగి తిరిగి తన హోటల్‌కు వెళ్లిపోయారు. ఎయిరిండియా సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్య సరిచేసిన అనంతరం మూడు గంటల తర్వాత రాష్ట్రపతి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు.