అడవిలో చిక్కుకున్న 70 ఏళ్ల బామ్మ.. కాపాడి 5 కి.మీ భుజాలపై మోసుకొచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలు!
- ఒడిశాలోని న్యుపారాలో ఘటన
- ఇంట్లో గొడవ జరగడంతో అలిగిన వృద్ధురాలు
- అడవిలోకి వెళ్లాక దారితెలియకపోవడంతో ఇబ్బంది
అయితే కూంబింగ్ కోసం అటుగా వెళుతుగా సీఆర్పీఎఫ్ 216వ బెటాలియన్ సదరు వృద్ధురాలిని గుర్తించింది. దట్టమైన అడవిలో వాహనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు తొలుత ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. మంచినీరు అందించాక వృద్ధురాలు స్థిమితపడటంతో డోలీని సిద్ధం చేశారు. అనంతరం దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆ పెద్దావిడను మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగా, సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.