చిత్తూరు జిల్లాలో ఘోరం.. దగ్ధమైన కారు.. ఐదుగురి సజీవ దహనం

  • బెంగళూరు నుంచి పలమనేరు వైపు వెళ్తుండగా ఘటన
  • బోల్తాపడడంతో కారులో చెలరేగిన మంటలు
  •  మామడుగు సమీపంలో ఘటన
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులోని ఐదుగురు సజీవ దహనం కాగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరు నుంచి పలమనేరు వెళ్తున్న కారు చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు సమీపంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది.

ఆ వెంటనే కారులో మంటలు చెలరేగడంతో కారులోని ప్రయాణికులు బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. ఒకరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Andhra Pradesh
Chittoor District
car accident

More Telugu News