Varla Ramaiah: దళితులతో ఆట, పులులతో వేట ఒక్కటే అని గ్రహించండి: జగన్ కు వర్ల రామయ్య ఘాటు హెచ్చరికలు

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ఏపీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పల్నాడు పరిస్థితులు, ఛలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం జగన్ ను ఘాటుగా హెచ్చరించారు.

దళితుల మనోభావాలతో ఆడుకుని అధికారంలోకి వచ్చారని, దళితులను రాజకీయ ఆటవస్తువులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. కానీ దళితులతో ఆట, పులులతో వేట ఒక్కటే అని సీఎం గారు గ్రహించాలని స్పష్టం చేశారు. దళితులను ప్రతి విషయంలోనూ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దని హితవు పలికారు. అట్రాసిటీ చట్టాన్ని రాజకీయం చేస్తూ, దళితులను బలిపశువులను చేయొద్దని హెచ్చరించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News