చెల్లెలి ద్వారా పరిచయం అయ్యాడు... లవ్ లో పడిపోయాను: కథానాయిక తాప్సి

  • పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి
  • రోజుల తరబడి వేడుకలు ఉండవు
  • ఒక్క రోజు పెళ్లి మాత్రమేనన్న తాప్సీ
తాను ప్రేమలో పడ్డానని ఇంతకాలానికి హీరోయిన్ తాప్సీ అంగీకరించింది. అయితే, పిల్లలను కనాలని అనుకున్నప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకుంటూ, తనను తాను నటిగా నిరూపించుకుంటున్న తాప్సీ, ఇప్పుడు 'సాద్ కీ ఆంఖ్' చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉంది.

ఈ క్రమంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తన చెల్లెలి ద్వారా అతను పరిచయం అయ్యాడని, అతను నటుడు, క్రికెటర్ కాదని, ఈ ప్రాంతానికి చెందిన వాడే కాదని  స్పష్టం చేసింది. తానేమీ రోజుల తరబడి జరిగేలా వివాహ వేడుకను జరుపుకోబోనని, కేవలం ఒక్క రోజులో తన వివాహం బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరుగుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చిన యువకుడిని చూపించినందుకు చెల్లెలికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటానని ఈ 32 ఏళ్ల చిన్నది వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Taapsi
Marriage
Love

More Telugu News