వైజాగ్ లో ఒక్కడు... 130 బైకులు దొంగిలించాడు... హీరో హోండా వాహనాలే టార్గెట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైజాగ్ లో ఒక్కడు... 130 బైకులు దొంగిలించాడు... హీరో హోండా వాహనాలే టార్గెట్!

  • విశాఖలో 2013 నుంచి జోరుగా బైకు దొంగతనాలు
  • పోలీసులకు సవాల్ గా మారిన వైనం
  • ఎట్టకేలకు మిస్టరీ ఛేదించిన పోలీసులు
గత ఆరేళ్లుగా విశాఖ పరిధిలో బైకులు మాయం అవుతుండడం పోలీసులకు సవాల్ గా మారింది. అది కూడా కేవలం హీరో హోండా బైకులే ఎక్కువగా చోరీకి గురవుతుండడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. అయితే, ఆ మిస్టరీ దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

వీరయ్య చౌదరి అనే వ్యక్తి ఏకంగా 130 బైకులను దొంగిలించినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2013 నుంచి బైకుల దొంగతనాలే లక్ష్యంగా పెట్టుకున్న వీరయ్య విశాఖ నగరంలోనూ, చుట్టు పక్కల గ్రామాల్లోనూ నిలిపి ఉంచిన బైకులను ఎత్తుకెళ్లేవాడు. అయితే పక్కాగా వలపన్నిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చోరీకి గురైన బైకులను రికవరీ చేసిన పోలీసులు వాటిని ఓ మైదానంలో ప్రదర్శనకు పెట్టాల్సి వచ్చింది.
Vizag
Bike
HeroHonda

More Telugu News