India: భారత్ మా దేశం.. కశ్మీర్ అందులో అంతర్భాగం.. తీర్మానం చేసిన జమాయిత్ ఉలేమా ఏ హింద్!

షార్ట్స్‌లో చూడండి
జాతీయవాద ముస్లిం సంస్థ ‘జమాయిత్ ఉలేమా ఏ హింద్’ కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ప్రత్యేకంగా తీర్మానం చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మహమూద్ మదానీ తెలిపారు. భారత్ సమగ్రత, భద్రత విషయంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. భారత్ తమ దేశమనీ, తాము దేశానికి అండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. దాయాది దేశం పాకిస్థాన్.. ముస్లింలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పాక్ చేస్తున్న ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

1919లో ఏర్పాటైన ‘ జమాయిత్ ఉలేమా ఏ హింద్’ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్(కాంగ్రెస్ పార్టీ)తో కలిసి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొంది. మతం ఆధారంగా దేశాన్ని భారత్, పాకిస్థాన్ అని విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో కొందరు తిరుగుబాటు నేతలు వీరి నుంచి విడిపోయి జమాయిత్ ఉలేమా ఇస్లామ్ పేరుతో కొత్త సంస్థను పెట్టుకున్నారు.
Go Back to Shorts
India
Pakistan
Jamiat Ulema-e-Hind
Resolution
mohamood madani

More Telugu News