జయలలిత సమాధే వేదిక... వైభవంగా అన్నాడీఎంకే నేత కుమారుడి వివాహం!
- కుమారుడి పెళ్లిని నిశ్చయించిన భవానీ శంకర్
- అమ్మపై అభిమానంతో సమాధి ముందే పెళ్లి
- ఆశీర్వదించేందుకు తరలి వచ్చిన ప్రముఖులు
తానెంతో అభిమానించే జయలలిత దూరమై మూడేళ్లు గడుస్తున్నా ఆమెను మరచిపోలేదని, అమ్మ ఆశీర్వాదం తన కొడుకు, కోడలికి ఉండాలన్న ఉద్దేశంతోనే పెళ్లిని ఇక్కడ జరిపిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా జయలలిత సమాధిని పూలతో అందంగా అలంకరించారు. వధూవరులను ఆశీర్వదించేందుకు అన్నా డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.