ప్రభాస్ అంటే చాలా ఇష్టం: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్
- యూత్ లో పాయల్ కి క్రేజ్
- హాట్ భామగా దక్కిన మార్కులు
- ప్రభాస్ తో నటించాలని ఉందన్న పాయల్
తాజా ఇంటర్వ్యూలో 'ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్ గా అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం .. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని వుంది' అని చెప్పింది. ఆమె ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.