వైసీపీ ‘ఛలో ఆత్మకూరు’కు అనుమతి కోరిన నేతలు

వైసీపీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రేపు ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఐజీని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేశ్ కలిశారు. కాగా, వైసీపీ దాడులను నిరసిస్తూ రేపు ‘ఛలో ఆత్మకూరు’కు టీడీపీ పిలుపు నిచ్చింది. రేపు టీడీపీ, వైసీపీ లు పోటాపోటీగా ‘ఛలో ఆత్మకూరు’ నిర్వహించాలని చూస్తున్నాయి.
Go Back to Shorts
YSRCP
chalo Atmakur
Ambati Rambabu
Nandigam

More Telugu News