'భీష్మ' విడుదల తేదీ ఖరారైపోయినట్టే
ఈ సినిమాలో హెబ్బా పటేల్ నెగిటివ్ రోల్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. 'ఛలో' మాదిరిగా ఈ సినిమాలోనూ యూత్ కి నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా వెంకీ కుడుముల జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. నితిన్ - రష్మిక కాంబినేషన్ ను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.