విశాఖ పోర్టులో మళ్లీ అగ్నిప్రమాదం...పక్షం రోజుల్లో రెండోది
- ఈస్ట్ క్యూ 7 నంబర్ బెర్త్ క్రేన్‌లో మంటలు
- పూర్తిగా దగ్ధమైన పరికరం
- గత నెల 26వ తేదీన ఇదే ప్రాంతంలో భారీ ప్రమాదం
గత నెల 26వ తేదీన పోర్టులోని హార్బర్ మొబైల్ క్రేన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ రోజు సాయంత్రం ఇన్నర్ హార్బర్లోని డబ్ల్యూక్యూ-1 బెర్త్‌లో ఎంవీ యాస ఫల్కాన్లో ఐరన్ ఓర్ లోడ్ చేస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి క్రేన్ ఆపరేటర్ తప్పించుకోగా, క్రేన్ మాత్రం పూర్తిగా దగ్ధమైంది.
గత నెలలోనే అవుటర్ హార్బర్‌లోనూ భారీ ప్రమాదం జరిగింది. కోస్టల్ జాగ్వార్ అనే ఆఫ్ షోర్ సపోర్ట్ వెహికిల్ లో మంటలు చెలరేగడంతో ఒకరు చనిపోగా 13 మంది గాయపడ్డారు. ప్రమాద సమయానికి 29 మంది షిప్ లో ఉండగా వారంతా సముద్రంలోకి దూకేసి తప్పించుకున్నారు.