యజ్ఞయాగాదులు చేసినవాళ్లంతా ఉత్తములు కారు, పురాణాల్లో రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యజ్ఞయాగాదులు చేసినవాళ్లంతా ఉత్తములు కారు, పురాణాల్లో రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్

  • యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలు
  • ఆలయాల్లో రాజకీయపరమైన చిత్రాలు ఉండడాన్ని సహించబోమన్న లక్ష్మణ్
  • వారం రోజుల్లో తొలగించాలని వ్యాఖ్యలు
యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మలు చిత్రించిన వైనం తీవ్ర విమర్శల పాలవుతోంది. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. యజ్ఞయాగాదులు చేసినంత మాత్రాన ఉత్తములు కారని, పురాణాల్లో రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో నిర్మించిన ఆలయాల్లో రాజకీయపరమైన చిత్రాలు ఉండడాన్ని సహించబోమని అన్నారు. కేసీఆర్ పై అంత భక్తి ఉంటే ఇళ్లలో ఆయన ఫొటోలు పెట్టుకుని పూజించుకోండి అంటూ అధికారులపై మండిపడ్డారు.

ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైనా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయంలో వ్యక్తుల చిత్రాలను ముద్రించడం అంటే దేవుడ్ని కించపర్చడమేనని, వారం రోజుల్లో ఆ చిత్రాలు తొలగించకపోతే హిందుత్వ సంస్థలు, బీజేపీ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు.
KCR
TRS
BJP
Lakshman

More Telugu News