chandrayan-2: ‘చంద్రయాన్-2’ అపురూప ఘట్టాన్ని వీక్షించనున్న ప్రధాని మోదీ!

  • మరికొన్ని గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్
  • బెంగళూరు ఇస్రో సెంటర్ లో మోదీ కోసం ఏర్పాట్లు
  • మోదీతో పాటు వీక్షించనున్న స్కూల్ విద్యార్థులు  

‘చంద్రయాన్-2’కు చెందిన ల్యాండర్ మరికొన్ని గంటల్లో జాబిల్లిపై దిగనుంది. చంద్రుడిపై విక్రమ్ రోవర్ ల్యాండ్ అయ్యే దృశ్యాన్ని శాస్త్రవేత్తలతో కలిసి ప్రధాని మోదీ వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ఇస్రో సెంటర్ లో మోదీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ దృశ్యాన్ని మోదీతో పాటు డెబ్బై మంది స్కూల్ విద్యార్థులు వీక్షించనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని శాటిలైట్ కంట్రోల్ సెంటర్ (ఎస్ సీసీ) నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా పొందుపరచనుంది. యూట్యూబ్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఛానెల్ ద్వారా ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించవచ్చు. చంద్రుడిని చూస్తూ ప్రజలు కూడా తమ అనుభూతిని తనతో పంచుకోవాలని, చంద్రయాన్ ఫొటోలతో తనకు ట్వీట్ చేయాలని, వాటిలో కొన్నింటికి తాను రీ ట్వీట్ చేస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీ తెలిపారు.

More Telugu News