గెస్ట్ హౌస్ ల పేరిట వ్యభిచారం... విశాఖ పరిధిలోని సీతమ్మధార, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో పోలీసుల ఉక్కుపాదం!
- ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
- స్వయంగా రంగంలోకి దిగిన డీసీపీ
- పోలీసుల అదుపులో పలువురు
వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీపంలోని విశాఖ ఇన్, సీతమ్మధారలోని శ్రీ సాయి గెస్ట్ హౌస్, పాండురంగాపురం బీచ్ గెస్ట్ హౌస్, ఆరు ఎస్‌కేఎంఎల్ ఫ్లాట్లను సీజ్ చేశారు. సీతమ్మధార ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్ లో థాయ్ ల్యాండ్ యువతులతో పురుషులకు మసాజ్ చేయిస్తున్నారని గుర్తించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై ఇక్కడికి అమ్మాయిలను తీసుకుని వస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. పలువురు యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, గెస్ట్ హౌస్ లు, లాడ్జీల నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని అన్నారు.