Andhra Pradesh: విశాఖ జిల్లాలో భారీ వర్షాలు.. పాడేరు మన్యంలో కూలిన వంతెన!

  • పాడేరులో 9 సెం.మీ వర్షపాతం నమోదు
  • నీట మునిగిన పంటపొలాలు
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాడేరు మన్యంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి హుకుంపేట మండలం పెద్దగరువు-బిసాయిపుట్టు మార్గంలో వంతెన తెగిపోయింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

చాపరాయి, కితలంగి, కించుమండ, కోసంగి, లోగిలిగెడ్డ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండంతో ఇక్కడి పంటపొలాలు నీట మునిగాయి. దీంతో తమ పంటలు దెబ్బతినడంపై రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నిన్న ఒక్కరోజే పాడేరులో 9 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

More Telugu News