డీకే శివకుమార్ పై బీజేపీ వేధింపులకు కారణం ఇదే: సిద్ధరామయ్య
- బీజేపీలో చేరనందుకే శివకుమార్ ను వేధిస్తున్నారు
- కాంగ్రెస్ నేతలకు మనుగడ లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారు
- శివకుమార్ ను కావాలనే అరెస్ట్ చేయించారు
డీకే శివకుమార్ ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా తెలుసని... అయినా కావాలనే అరెస్ట్ చేయించారని సిద్ధరామయ్య మండిపడ్డారు. సమన్లు జారీ కావడంతో ఈడీ విచారణ కోసం శివకుమార్ ఢిల్లీ వెళ్లారని... నాలుగు రోజులు విచారించిన తర్వాత అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని చెప్పారు. చిదంబరంను అరెస్ట్ చేసిన తర్వాత శివకుమార్ ను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు.