టీడీపీకి పూర్వవైభవమే లక్ష్యంగా.. రేపటి నుంచి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన!
- తూర్పు గోదావరి నుంచి పర్యటన షురూ
- వివరాలు ప్రకటించిన ఎమ్మెల్యే చినరాజప్ప
- కాకినాడలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ
రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అచ్చంపేటలోని కల్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారనీ, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అనంతరం కాకినాడలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఇలా 13 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని చినరాజప్ప అన్నారు.