Tamil Nadu: చీర మార్చుకునేందుకు గదిలోకి వెళ్లి అదృశ్యమైన పెళ్లికుమార్తె!

షార్ట్స్‌లో చూడండి
మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కుమార్తె అదృశ్యమైన ఘటన తమిళనాడులోని గుడియాత్తంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన యువతికి గుడియాత్తం ప్రాంతానికి చెందిన మేనమామతో పెళ్లి నిశ్చయమైంది. గుడియాత్తం ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి విందు కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా, నలుగు కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం చీర మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన వధువు ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానించిన బంధువులు గదిలోకి వెళ్లి చూడగా పెళ్లి కుమార్తె కనిపించలేదు. దీంతో కంగారుపడిన బంధువులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో బంధువులు తిరుగుముఖం పట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Tamil Nadu
marriage
bride

More Telugu News