కశ్మీరీ యువకుడికి బదులు పోర్న్‌స్టార్ ఫొటోను రీట్వీట్ చేసిన పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కశ్మీరీ యువకుడికి బదులు పోర్న్‌స్టార్ ఫొటోను రీట్వీట్ చేసిన పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్!

  • రాళ్ల దాడిలో చూపు కోల్పోయాడంటూ పోర్న్ స్టార్ ఫొటో రీట్వీట్
  • స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాక్ జర్నలిస్ట్
  • డిలీట్ చేసిన అబ్దుల్ బాసిత్
భారత్‌లో పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తప్పులో కాలేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ను ఎండగట్టబోయి బొక్కబోర్లా పడ్డారు. కశ్మీర్‌లో జరిగిన రాళ్ల దాడిలో ఓ యువకుడు కన్ను కోల్పోయాడంటూ ఓ ఫొటోను రీట్వీట్ చేశారు. అయితే, అందులో ఉన్నది కశ్మీరీ యువకుడు కాదు.. అడల్ట్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

పాకిస్థాన్‌కే చెందిన జర్నలిస్టు నైలా ఇనాయత్.. బాసిత్ ట్వీట్ స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.  మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీరీ యువకుడికి బదులు అడల్ట్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ ఫొటోను ట్వీట్ చేశారని నైలా పేర్కొన్నారు.

అబ్దుల్ బాసిత్ ఫొటోను రీట్వీట్ చేస్తూ.. రాళ్లదాడిలో కంటి చూపు కోల్పోయాడని, భారత్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని అందులో కోరారు. అయితే, యూసుఫ్‌కు బదులు పోర్న్ స్టార్‌ ఫొటోను ట్వీట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బాసిత్ ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
Abdul Basit
Pakistan
Jammu And Kashmir
adult porn star

More Telugu News